Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద సీఎస్, ఓఎస్డీగా పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణ ఇంటిపై సీఐడీ ఆకస్మిక దాడులను నగర టీడీపీ నాయకులు ఖండించారు. సీఐడీతో తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేయాలనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిసోందని ఆరోపించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పి.సాయిబాబా నేతృత్వంలో నగరంలోని లక్ష్మినారాణ ఇంటి వద్ద ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ లక్ష్మినారాయణ హైయ్యర్ ఎడ్యుకేషన్‌లో ఎన్నో ఎండ్లు పని చేశారనీ, మచ్చలేని అధికారని తెలిపారు. ముందస్తు నోటీసులు లేకుండా సీఐడీ దాడులు చేయడాన్ని తప్పుబట్టారు. ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారనీ, రాబోయే రోజుల్లో ప్రజలే ఏపీ ప్రభుత్వానికి బుద్ధి చెపుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, పార్లమెంట్ వర్కింగ్ ప్రసిడెంట్ నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శులు పి.బాలరాజ్‌గౌడ్, రాజా చౌదరి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దోజు రవీంద్రాచారి, రాష్ట్ర అధ్యక్షులు ఎం.కె.బోసు, సీహెచ్ విజయశ్రీ, ఎం.నర్సింహులు, ఎస్.లత, మల్లిఖార్జున్, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.