Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొత్తపేటలో అతిథిదేవోభవ రెస్టారెంట్‌ను డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, ఎమ్మెల్సీ బొగ్గరపు దాయనంద్, లోకల్ కార్పొరేటర్స్‌తో ప్రారంభించారు. భోజన ప్రియులకు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందించేందు కు సీవీల్ గ్రూప్ అతిథిదేవోభవ రెస్టారెంట్‌ని కొత్తపేట నుంచి నాగోల్ వెళ్లే దారిలో అందుబాటులోకి తీసుకొ చ్చారు. ఈ రెస్టారెంట్‌ను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, కార్పొరేటర్స్ వెంకట నర్సింహ, పవన్ కుమార్, ప్రేమ్ మహేష్, సామల హేమ, కండి శైలజ, సినీనటులు సర్లీన్ కౌర్, ఫారీదా యూసఫ్ మోడల్స్ కలసి కొత్తపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంలో సినీనటిలు మాట్లా డుతూ విభిన్న ఆహార రుచులను అందించేందుకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందన్నారు. తనకు మటన్, చికెన్ చాలా ఇష్టం అని చెప్పారు. బోజన ప్రియులకు విభిన్న రుచులను అందించేందుకు అథితిదేవోభవ రెస్టారెం ట్ను ఇక్కడ ఏర్పాటు చెయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అథితిదేవోభవ రెస్టారెంట్ నిర్వాహకులు మహిచంద్ మాట్లాడుతూ కొత్తపేటలో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. రెస్టారెంట్ తోపాటు తాము బ్యాంకెట్ హాల్, రూమ్స్‌ను కూడా త్వరలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రెస్టారెంట్ డిజైన్ ధీమ్ ప్రత్యేకమనీ, డైనింగ్ సెటఫ్లో కూర్చునే ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేస్తారన్నారని తెలిపారు. ఈ సందర్భంగా మోడల్స్ సర్లీన్ కౌర్, ఫారీదా యూసఫ్ రెస్టారెంట్లో సందడి చేశారు.