Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సిటీలోని రిజర్వాయర్ల వద్ద జలమండలి భద్రతా చర్యలను చేపట్టింది. 'రిసాలగడ్డ వాటర్ ట్యాంకు' వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రయివేటు ఏజెన్సీ ద్వారా వందమంది సెక్యూరిటీ గార్డులను నియమించింది. సిటీలోని ఆయా రిజర్వాయర్ల వద్ద వీరు 24 గంటలపాటు విధులు నిర్వహించనున్నారు. జలమండలి విజి లెన్స్ విభాగంతో పాటు స్థానిక పోలీసుల సమ న్వయంతో పని చేయనున్నారు. కొత్త సెక్యూరిటీ గార్డులకు శుక్రవారం ఖైరతాబాద్‌లోని జలమం డలి హెడ్ ఆఫీసులో ఉన్నతాధికారులు అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ రిజ ర్వాయర్ల వద్దకు బయటి వ్యక్తులను అనుమ తించొద్దని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. వినియోగదారులు, సాధారణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆఫీసు సమయాల్లో అధికారు లను కలిసి వివరించవచ్చన్నారు. రిజర్వాయర్ల ప్రాంగణాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నిత్యం జాగ్రత్తగా ఉండాలని ఆదే శించారు. ఏవైనా సమస్యలుంటే జలమండలి విజిలెన్స్ విభాగం, స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. రిజర్వాయర్ల వద్ద లాగ్ బుక్‌లను ఏర్పాటు చేయాలనీ, ఇక్కడికి వచ్చే ఉద్యోగులతో పాటు అందరి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. అనంతరం కొత్త సెక్యూరిటీ గార్డులు ఖైరతాబాద్ జల మండలి ప్రధాన కార్యాలయం ముందు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి ఆయా రిజర్వాయర్ల వద్ద విధు ల్లో చేరారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ రవిచంద్రన్‌రెడ్డి, సీజీఎం విజయరావు, ఎజైల్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.