Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రొగ్రాం(ఎస్ఎన్డీపీ)లో భాగంగా చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యాలయంలో శుక్రవారం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌తో కలిసి జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేష్‌కుమార్ మాట్లాడుతూ... ప్రతివారం అభివృద్ధిపై పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి పనికీ ప్రత్యేకంగా వివరాలతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తయారుచేయాలని, ఈ పనుల్లో ఇండ్లు కోల్పోయేవారికి సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని సూచించారు. ప్రతి పనికీ ఆయాశాఖలకు చెందిన అధికారులను ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. ప్రతి మంగళవారం ఉదయం 10.30 గంటలకు తమ ఆధ్వర్యంలో సమీక్ష ఉంటుందని చెప్పారు. వారానికొక రోజు ముఖ్యమైన పనిని తనిఖీ చేయనున్నట్టు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ, జీహెచ్ఎంసీ ఈఎన్సీ, చీఫ్ ఇంజనీర్లు, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.