Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ఉరేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం సుద్దాల గ్రామం, గుండాల మండలం, భువనగిరి జిల్లాకు చెందిన పొదల నరసయ్య వ్యవసాయ కూలి. తన రెండో కూతురు పొదల లావణ్యను అంబోజు ఉపేందర్కు ఇచ్చి 2017లో వివాహం జరిపించారు. వివాహానంతరం తంతారు స్వగ్రామం నుంచి ఈశ్వరపురి కాలనీ, సైనిక్ పురి, కాప్రాకు జీవనోపాధి కోసం వచ్చారు. అల్లుడు తన కూతుర్ని శారీరకంగా, మానసికంగా వేధించేవాడనీ, అతని వేధింపులు భరించలేని కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో తన కుమార్తె 6 నెలల గర్భాన్ని కోల్పోయిందని తెలిపారు. తన కుమార్తె యొక్క మామ ఎ.లింగయ్య, అత్త పద్మ కూడా అదనపు కట్నం కోసం వేధించే వారనినీ, ఇష్టం లేకపోతే రెండో వివాహం చేసుకుంటానని బెదిరించి చిత్రహింసలు పెట్టేవారని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురు భర్త, చుట్టాల వేధింపులకు తట్టుకోలేకనే తన కూతురు గదిలో చీరతో ఇనప రాడుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపటినట్టు పోలీసులు తెలిపారు.