Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ జీహెచ్ఎంసీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా (మటన్) మాంసం విక్రయాలు జరుపుతున్న షాపులపై జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దుకాణదారులకు కోర్టుకు హాజరుకావాల్సిందిగా నోటీసులు అందజేసి, 20 కిలోల మాంసాన్ని సీజ్ చేసి పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. ఆనంద్ బాగ్ లోని కోహినూర్ మటన్ షాప్, నేరేడ్ మెట్ క్రాస్ రోడ్లోని ఒకే దుకాణానికి రెండు బోర్డులు ఏర్పాటు చేసుకుని అక్రమంగా మాంసాన్ని విక్రయిస్తున్న వైట్ హౌస్ (డైమండ్) మటన్ దుకాణాన్ని స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీ చేసి జీహెచ్ఎంసీ చట్టం 195లోని సంబంధిత సెక్షన్ల కింద వ్యాపారులపై కేసు నమోదు చేసినట్టు అధికారి డాక్టర్ సరిత తెలిపారు.