Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్‌లోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం హోమం తదుపరి శ్రీ స్వామి వారి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యిర్వహణాధికారి వి.నరేందర్, జూనియర్ అసిస్టెంట్ బాల నర్సయ్య, ఆలయ మాజీ ధర్మకర్త కే.వెంకట్ రామ్ రెడ్డి, స్థానిక భక్తులు శివ రామ క్రిష్ణ, వంశీ, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.