Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు ఐదో వార్డు గాంధీనగర్లో ఆదివారం నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా మంచి నీటి సమస్య పరిష్కారం కోసం రూ.ఐదు లక్షల వ్యయంతో పైపు లైన్ నిర్మాణానికి చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూమయ్య, నరేందర్, సతీష్, మహి, పలువురు కార్యకర్తలు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.