Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
రూ.3 లక్షల వ్యయంతో పేదలు శుభకార్యాలు చేసుకోవడానికి బలం రాయి ఈద్గా వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ నాయకులు జంపన ప్రతాప్ అన్నారు. ఆదివారం ఆ ప్రాంతంలో పర్యటించారు. సందర్భంగా స్థానికులకు హామీ ఇచ్చిన సందర్భంగా ఈద్గా కమ్యూనిటీ హాల్లోని అంగన్వాడీ కేంద్రంలో ఫ్యాన్లు, ట్యూబులైట్స్, సున్నం, నీటి వసతి కోసం సింటిక్స్ ట్యాన్క్ ఏర్పాటు పనులను జంపన పర్యవేక్షించారు. శిథిలావస్థకు చేరిన సామూహిక మరుగు దొడ్లను కూల్చివేసి విశాలమైన కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామన్నారు. బస్తీలో సమస్యలను బోర్డు అధికారుల దృష్టికి తీసికెళ్ళి పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాల్ రాజు, చంటి, రాములు, మురళి, ఇల్లందుల శంకర్, మాధవి, శ్యామల, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.