Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
వికలాంగుల హక్కుల పోరాట సమితి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఎన్. వినరు ఆధ్వర్యంలో స్వస్తి స్వరూప్ సుబద్ ట్రస్ట్ వారి సహకారంతో అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు వికలాంగులకు రూ.5కోట్ల విలువైన పరికరాలు బ్యాటరీ సైకిల్స్, ట్రై మోటర్ వాహనాలు, స్టిక్స్, వాకర్స్, స్టాండ్స్, ఐబిపీ క్రాసెస్, బ్లైండ్ స్టిక్స్, వివిధ రకాల పరికరాల కోసం రిజిస్ట్రేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి సర్కిల్ నుంచి 40 మంది వికలాంగులు రిజిస్టేషన్లు చేసుకునారని వినరు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేష్, జి.భాగయ్య, పి.విజరు కుమార్, పి.రాములు, తదితరులు పాల్గొన్నారు.