Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కింగ్స్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీ అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం ఓల్డ్ బోయిన్పల్లిలో సెమీ క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా పేద ప్రజలకు 200 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పేద ప్రజలకు సాయం చేయడంలో గొప్ప సంతృప్తి ఉంటుందని సుధాకర్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుత కరోనా మూడో దశ విపత్కర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ. పేద ప్రజలకు సేవ సహాయ కార్యక్రమాలు చేయాలని కోరారు. ధనికులు ఎంత మంది ఉన్నప్పటికీ సేవ చేయాలన్న దృక్పథం ఉన్న వారి సంఖ్య తక్కువే అన్నారు. సమాజంలో ఉన్నత స్థితిలో ధనికంగా ఉన్నవారు పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తే పేదరికం తగ్గుతుందన్నారు. పదేండ్లుగా పేద ప్రజలకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నామనీ, రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళతామని తెలిపారు.