Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
దూర విద్యారంగంలో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ విజరు కుమార్ అన్నారు. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కళాశాలలోని మహిళా అధ్యయన కేంద్రంలో ఆదివారం విద్యార్థుల అధ్యయన తరగతుల ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. విభిన్న కార ణాలతో మధ్యలో చదువు ఆగిపోయిన వారికి అంబేద్కర్ విశ్వవిద్యాలయం కోర్సులు ఎంతో ఉపయోగపడుతున్నా యన్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులెందరో ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రయి వేటు రంగాల్లో కీలక స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. నూతన విద్యార్థులు విశ్వవిద్యాలయ సేవలను వినియో గించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అధ్యయన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ మారోజు రామా చారి అధ్యక్షత వహిస్తూ తరగతుల నిర్వహణ, సమయ పాలన, పరీక్షలు, వివిధ కోర్సుల గురించి అవగాహన కల్పించారు. అనంతరం కౌన్సిలర్లు, విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.