Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ను ప్రైవేటైజేషన్ చేస్తే సహించేది లేదని ఆలిండియా నేషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వి.నరసింహన్, సంయుక్త ప్రధాన కార్యదర్శి సంజరు చక్రవర్తి, తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఆదిల్ షరీఫ్ పేర్కొన్నారు. ఆదివారం ఆలిండియా నేషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఐఎన్టీయూసీ కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు సమావేశంలో వారు మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న సంస్థల తోపాటు లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేయడం ఏంటని ప్రశ్నించారు. బీఎస్ఎన్ఎల్, భారతీయ రైల్వే, ఎయిర్‌పోర్టులు, తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ఎన్నో ప్రైవేటైజేషన్ చేశారని తెలిపారు. ఈ ప్రైవేటైజే షన్తో పేదలకు ఒరిగేదేమీ లేదనీ, కేవలం ధనిక వర్గాలను మరింత ధనిక వర్గాలుగా తయారు చేయడమేనని అన్నారు. జాతీయ స్థాయిలో వీరిని ప్రతిఘటించేందుకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నర్సింహారెడ్డి, డాక్టర్ రఘు కుమార్, తదితరులు పాల్గొన్నారు.