Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ వెంకటాపురం డివిజన్లో ఆదివారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బస్తీ దవాఖానను డివిజన్ కార్పొరేటర్లు రాజ్ జితేందర్ నాథ్, సబితా అనిల్ కిషోర్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ వైద్య సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కౌకుర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ప్రారంభించారు. వేలాది రూపాయలు ఖర్చు చేసే స్తోమత లేని ఆర్థికంగా వెనుకబడిన పేదల కోసమే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఆనంద్, డీఎంహెచ్ఓ మల్లికార్జున్, విట్టల్‌రావు, డాక్టర్ ప్రసన్న లక్ష్మి, స్నేహ, మెట్టు బాలమణి, డాక్టర్ ప్రదీప్‌రెడ్డి, బాబు, సురేందర్‌రెడ్డి, మల్లికార్జున్, వెంకటేష్ గౌడ్, వెంకటేష్ యాదవ్, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.