Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
నగరంలో ఉన్న మైనార్టీ ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ డిమాండ్ చేశారు. ఆవాజ్ కార్వాన్ జోన్ కమిటీశ్రీతీ టోలి చౌకిలో 21 మందితో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. నగరంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంద న్నారు. ఆటోడ్రైవర్‌కు రూ.5లక్షల లోన్లు ఇవ్వా లని అనేకసార్లు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి విన్నవించినా ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. కరోనా తర్వాత జీవన స్థితిగతులు చాలా ఇబ్బందిక రంగా, కుటుంబాలు గడవడం కష్టంగా అయింద నీ, ఆటో ఫైనాన్స్ ఆగడాలు అధికమవ్వడంతో పిల్లల చదువులు, ఖర్చులు ఇబ్బందికరంగా మారుతున్నాయనీ, వెంటనే ప్రభుత్వం లోన్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు బాబర్ ఖాన్, షేక్ యాకూబ్ పాల్గొన్నారు.
నూతన కమిటీ..
ఆవాజ్ కార్వాన్ నూతన యాక్షన్ కమిటీని 21 మందితో ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షు లుగా ఇర్షాద్ అలీ ఖాన్, ఉపాధ్యక్షులుగా అబ్దుల్ రషీద్, కార్యదర్శిగా అబ్దుల్ రహీం, సహాయ కార్యదర్శిగా సయ్యద్ హఫీజు ద్దీన్, మహమ్మద్ ఖలీల్, ఆర్గనైజింగ్ మహమ్మద్ రావూఫ్, ట్రెజరర్‌గా మొహమ్మద్ నయీమ్, సభ్యులుగా మహమ్మద్ అలీ ఖాన్, మహమ్మద్ నిసార్, షేక్ ఆరీఫ్, అహ్మద్ రఫీ, మహమ్మద్ జహన్‌గీర్, అయూబ్ ఖాన్, సయ్యద్ షంషుద్దీన్, మహమ్మద్ హుస్సేన్, షేక్ హస్మత్, మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ అజీమ్, తదితరులు పాల్గొన్నారు.