Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి ఎంతో కషి చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఖైసర్ భాం అన్నారు. ఆదివారం జల్పల్లి మున్సిపల్లోని 3వ వార్డులో మున్సిపల్ అధ్యక్షులు ఎక్బాల్ ఖలిఫా, కాంటెస్టెడ్ వార్డు కౌన్సిలర్ అబ్దుల్లా గాలిబ్ల ఆధ్వర్యంలో వార్డు కమిటీలను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశంతో మున్సిపల్లోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను పేద ప్రజలకు చేరే విధంగా ప్రతి ఒక్కరూ కషి చేెయాలన్నారు. అనంతరం నియామకపు పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాసర్ అవల్గీ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.