Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆధ్వర్యంలో హయత్నగర్ సర్కిల్ పరిధిలోని వీరన్న గుట్టను సీపీఐ(ఎం) ప్రతినిధి బందం ఆదివారం సందర్శించారు. సీపీఐ(ఎం) హయత్నగర్ సర్కిల్ కార్యదర్శి కీసరి నర్సిరెడ్డి మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే దష్టికి అనేక పర్యాయాలు కాలనీవాసుల సమస్యలు తీసుకొచ్చామని, కానీ సమస్యలు పరిష్కారం కాలేదని ప్రతినిధి బందానికి ఆవేదనతో వారు చెప్పారు. వారు వీధులన్నీ చూపించి సమస్యలను విన్నవించుకున్నారు, కాలనీవాసులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని కోరారు. ప్రభుత్వాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. గెలిచాక ప్రజా ప్రతినిధులు కాలనీల వైపు చూడని పరిస్థితి ఉంది. కావున వారు చేసిన వాగ్దానాన్ని నిలబెటుకోవాలని, ప్రజల సమస్యలు తీర్చాలని కోరారు. కాలనీలో డ్రయినేజీ ట్రంపు లైన్ వేశారని, వీధిలో వేయాల్సిన డ్రయినేజీ పైపులైన్ వేయకుండా కాలనీవాసు లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. కాలనీ బలహీనవర్గాల పేదలకు, వికలాంగులకు 1993లో సంవత్సరంలో ఇచ్చారు. నేటకి 28 సంవత్సరాలు కావస్తున్నా కాలనీ అభివద్ధి కానీ, కాలనీ సమస్యలు పరిష్కరించుటకు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. జీహెచ్ఎంసీి నగరపాలక సంస్థ హయత్నగర్ సర్కిల్లో ఉన్న దుస్థితి ఈ విధంగా ఉంటే మిగతా చోట్ల ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. గతంలో అట్టహా సంగా వీధుల వెంట కంకర రోడ్డు నిర్మాణం చేపట్టకుండా గాలికి వదిలారు. కాలనీలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, ఒక వైపు నీరు వచ్చి మరోవైపు నీరు రాకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని జీహెచ్ఎంసీి కమిషనర్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాలనీలో పార్కు స్థలం డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పిల్లలు, పెద్దలు ఉపయోగించుకునే విధంగా క్రీడా స్థలాలు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హాల్ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి ప్రజల సమస్యలు చర్చించుకునే వేదికగా ఉండాలని కోరారు. ఈ సమస్యల పట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే, డిప్యూటీ కమిషనర్ పరిష్కరించే వైపు చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిచో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కాలనీవాసులని సమీకరించి ఆందోళనా పోరాటాలు చేస్తామని, దానికి ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ప్రతినిధి బందం కీసరి నర్సిరెడ్డి, ఆలేటి ఎల్లయ్య సోమయ్య, వెంకన్నతో పాటు బి.శంకరయ్య, కే.నరసింహ యాదవ్, ఎ.రాములు, కే.లింగయ్య తదితరులు పాల్గొన్నారు.