Authorization
Sat March 22, 2025 08:33:39 pm
నవతెలంగాణ-కల్చరల్
ఘంటసాల మరణించి నాలుగు దశాబ్దాలు పైగా గడిచినా ఇప్పటికీి ఆయన పాటలు అజరామరమై నిలిచివున్నాయని రాష్ట్ర శాసనమండలి పూర్వ సభ్యులు ఎస్.రామచంద్రరావు అన్నారు. ఘంటసాల పాటలు ఎందరికో సంగీత బిక్ష అని, నేటి గాయకులు ఆయన పాటలను పాడుకొని ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలో ఆదివారం ఎందరో మహానుభావులు శీర్షికన నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రఖ్యాత నేపధ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రామచంద్రరావు పాల్గొని మాట్లాడుతూ ఘంటసాల భక్తి, ప్రణయ, దేశభక్తి, మరే పాట నైనా అనుభూతి చెంది పాడే అద్భుత గాయకులు ఘంటసాల అని నివాళి అర్పించారు. గాన సభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఘంటసాల జయంతి నెల డిసెంబర్లో ఆయన కార్యక్రమం నిర్వహించటానికి పలు సంస్థలు ఆడిటోరియం కోసం పోటీ పడతారని వివరించారు. వైఎస్ఆర్ మూర్తి, గిడుగు కాంతి కృష్ణ, ఏవీఆర్ మూర్తి, బండి శ్రీనివాస్ వేదికపై పాల్గొన్నారు.