Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి ఎంతో కషి చేస్తుందని,ప్రభుత్వ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివద్ధి సాధించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంతర్జాతీయ వికలాంగుల వారోత్సవాల సందర్భంగా మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరైన వికలాంగులకు వివిధ ఉపకరణాలను వారికి బ్యాటరీతో నడిచే 117 ట్రై సైకిల్స్‌ను వికలాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమం కోసం కషి చేస్తున్నారన్నారు. వికలాంగులకు ప్రతి నెల రూ.3వేల రూపాయలతో పాటు అనేక పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు అర్జున్, పి.శ్రీనివాస్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, భిమిడి స్వప్న జంగారెడ్డి, సంతోషి శ్రీనివాస్‌రెడ్డి, లిక్కి మమత కష్ణారెడ్డి, బి.దీపిక శేఖర్ రెడ్డి, ముత్యాల లలిత కష్ణ, ఏనుగు రాంరెడ్డి, ఇంద్రసేన, యాతం పవన్ కుమార్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.