Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎల్బీ నగర్
వేపచెట్లకు డైబ్యాక్ వ్యాధి సోకి ఎండిపోతున్న దరిమిలా ఎల్.బి.నగర్ పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మెన్ భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆర్ధిక సహకారంతో వారం రోజులుగా వేప చెట్లకు మందు పిచికారీ కార్యక్రమం కొనసాగు తున్నది. ఇప్పటివరకు పలు డివిజన్లలో 150కి పైగా వేపచెట్లకు మందు పిచికారీ పూర్తి అయింది. ఆదివారం గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని వివేకానందనగర్ కాలనీలో వేపచెట్లకు మందు పిచికారి జరుగుతున్న కార్యక్రమంలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిటీ సభ్యులను అభినందించారు. కొంతమంది మనుషులకు దగ్గరవ్వడం, దూరం అవ్వడం జరగడం సహజమని, కానీ ప్రకతి మాత్రం ప్రతి ఒక్కరినీ దగ్గరికి తీసుకొంటుంది అన్నారు. మనం పీల్చేగాలి, తాగే నీళ్ళు, పారిశుధ్యం విషయంలో కూడా ప్రజలు గణనీయంగా చైతన్యవంతులౌతున్నారని, అటువంటివారి శాతం ఇంకా పెరగాల్సి ఉందని అన్నారు. అందుకోసం ఎల్.బి.నగర్ పర్యావరణ పరిరక్షణ కమిటీ సభ్యులు చేస్తున్న కషికి కాలనీ సంక్షేమ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు తగిన తోడ్పాటునందించాలని అన్నారు. ఇప్పటి వరకు మన్సురాబాద్, నాగోల్, హస్తినాపురం, చంపాపేట్, గడ్డి అన్నారం, లింగోజిగూడ, కొత్తపేట, చైతన్యపురి డివిజన్లలోని పలు కాలనీల్లో సమితి ఇన్చార్జి సభ్యుల సహకారంతో 150 చెట్లకు పైగా మందుకొట్టడం జరిగిందని అన్నారు. బి.ఎన్.రెడ్డి, వనస్ధలిపురం డివిజన్లలో కూడా మందు కొట్టే కార్యక్రమం మొదలౌతుందని సమితి చైర్మెన్ భావన శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బిచెనేపల్లి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు భవాని ప్రవీణ్ కుమార్, రమేష్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, రమణరెడ్డి, రవి చారి, నర్సింహారావు, యదా శంకర్, విక్కీ మరియు సమితి సభ్యులు గోపాల్ దాస్ రాము,జగన్ మోహన్, నవీన్ వల్లోజు, లింగేశ్వర్ గుప్త, సత్యనారాయణ, ప్రసూన ఉదరు రెడ్డి, యాదా రామలింగేశ్వరావు, రాజేందర్ కొండవీటి, శ్రీకాంత్ వంగిపురం, నగేష్ గురూజీ తదితరులు పాల్గొన్నారు.