Authorization
Sat March 22, 2025 10:54:45 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని దమ్మాయిగూడ మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ మంగళపురి వెంకటేష్, 6వ వార్డు కౌన్సిలర్ వరగంటి వెంకటేష్ అన్నారు. సోమవారం వార్డుల్లో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా తడి, పొడి చెత్త గురించి అవగాహనా ర్యాలీ నిర్వ హించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ కాలనీల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని సూచించారు. దమ్మాయిగూడను స్వచ్ఛ మున్సిపాల్టీగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.