Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం పురపాలక సంఘం పరిధిలోని మెయిన్ రోడ్డుకు నిర్మించిన అనుమతుల్లేని అక్రమ నిర్మాణాలను ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ టీం సభ్యుల ఆధ్వర్యంలో కూల్చి వేశారు. ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ టీం లీడర్ కె.బిందు రాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీఎస్బీ పాస్ ద్వారా అనుమ తులు పొంది అనుమతులకు అనుగుణంగా మాత్రమే నిర్మాణాలు చేపట్టాలన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే ఆ నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మెన్ వాణి, ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ టీం సభ్యులు, కీసర ఎస్ఐ జగన్రెడ్డి, బి.కుమారస్వామి, ఎస్.శ్రీనివాస్, సి.శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.