Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నేషనల్ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో లోక్ అదాలత్ ద్వారా 1755 కేసులు పరిష్కారం అయ్యాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం తెలిపారు. కమిష నరేట్ పరిధిల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం కావడంలో డీసీపీలు, ఏసీపీలే, సీఐలతోపాటు సిబ్బంది కృషి ఎంతో ఉందని సీపీ తెలిపారు. కమిషనరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఏసీపీలు, సీఐలను సీపీ ప్రత్యకంగా అభినందించారు. ఏసీపీలు (బేగంపేట్) పి.నరేష్‌రెడ్డి, (పంజాగుట్ట) పీవీ గణేష్, (చార్మినార్) జి.భిక్షంరెడ్డి, (గోషామహల్) ఎన్.సుధీర్, (సైఫాబాద్) సి.వేణుగోపాల్ రెడ్డి, (మలక్‌పేట్) ఎన్.వెంకట రమణతోపాటు ఎస్‌హెచ్‌వోలు (ఎస్ఆర్ నగర్) కె.సైదులు,(సైఫాబాద్) జీహెచ్ సైది రెరడ్డి, డీఐ రాజు నాయక్, (చిలకలగూడ) జి.నరేష్, (నార్త్‌జోన్ ఉమెన్ పోలీస్‌స్టేషన్) పి.పద్మా, (సౌత్‌జోన్ ఉమెన్ పీఎస్) జానకమ్మతోపాటు దివ్య తదితరులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ షీకాగోయేల్ పాల్గొన్నారు.