Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నెల 14వ తేదీన రవీంద్రభారతి మినీ హాల్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగే తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రపంచ వికలాంగుల దినోత్సవాలకు రావాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును మర్యాదపూర్వ కంగా కలసి తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర కమిటీ తరఫున ఆహ్వానించినట్టు రాహుల్ రాష్ట్ర అధ్యక్షులు గుత్తికొండ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఇన్చార్జి మెరుగు శివకృష్ణ, సలహాదారులు గోదా సంపత్ కుమార్, మనీషా, అబ్దుల్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.