Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు గౌతంనగర్ డివిజన్ పరిధిలోని ఏరియాల్లో తక్కువగా ఉన్న 12 ట్రాన్స్ఫార్మర్లను హైట్లో ఏర్పాటు చేయాలనీ, మెస్లను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాములు యాదవ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిషన్ డిపార్టుమెంట్ అధికారులు డీఈ సుభాష్, ఏడీఈ యాదగిరిని కలిసి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఏ స్వామి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.