Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండ లంలోని జగన్గూడ, కొల్తుర్, అనంతరం, నారాయణపుర్, పోతారం, ఉద్దేమర్రి, అద్రాస్ పల్లి గ్రామాల్లో రూ.80 లక్ష వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మూడు చింతలపల్లి గ్రామంలో వరి పంటకు బదులుగా ఇతర పంటలను వేస్తున్న రైతుల పొలంలోకి వెళ్లి పరిశీలించి కూరగాయల విత్తనాలను పొలంలో చల్లారు. అలాగే మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న స్టేడియం, వైకుంఠ దామలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను పరిశీలించారు. అద్రాస్పల్లి గ్రామంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ మదుకర ్రెడ్డి, ఎంపీపీ హారిక మురళిగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీలు హనుమంత రెడ్డి, అఖిలేష్ రెడ్డి, సుగుణ, సర్పంచులు విష్ణువర్ధన్ రెడ్డి, శిల్పా యాదగిరి, లలిత నర్సింహ, హరిమోహన్ రెడ్డి, అనురాధ రవీందర్రెడ్డి, రామచంద్రయ్య, జాం రవి, సింగం ఆంజనే యులు, కపాకర్ రెడ్డి, మూడుచింతలపల్లి మండల టీఆర్ ఎస్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, నాయకులు ఉడుతల బలరాం గౌడ్ , అనిల్ రెడ్డి పాల్గొన్నారు.