Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ సీసీనగర్లో రూ.20.64 కోట్లతో నిర్మించిన 264 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఈ నెల 17వ తేదీన ఉదయం 10.00 గంటలకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించ నున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో ఏర్పాట్లపై అధికారులు, లబ్దిదారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో హౌంమంత్రి మహమూద్ అలీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆరోజు వాహనదారులు ఇబ్బందులకు గురి కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని వసతులు గల సొంత ఇంటిలో పేద ప్రజలు సంతోషంగా ఉండాలనే సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి అర్హులైన పేదలకు ఉచితంగా అందజేస్తుందని వివరించారు. ఇండ్ల ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రి కేటీఆర్‌కు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలకనున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, పద్మారావు నగర్ పార్టీ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, వసంత, ముకుంద రెడ్డి, వెంకటదాస్ రెడ్డి, సికింద్రాబాద్ తహసీల్దార్ బాల శంకర్, లక్ష్పతి, రాజు, విజయ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.