Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సీిఎం దిశా నిర్దేశంతో స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పురపాలక, పట్టణా భివృద్ధి, ఐటీ, చేనేత, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం సనత్‌నగర్ ప్లే గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 1350 స్వచ్ఛ ఆటోలను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి, కమిషనర్ లోకేష్ కుమార్‌లతో కలిసి 250 మంది లబ్దిదారులకు స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్‌ను స్వచ్ఛంగా ఉంచాలన్న లక్ష్యంతో 2500 స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులలో 40 లక్షల పైబడిన జనాభా విభాగంలో హైదరాబాద్ నగరానికి వస్తున్నాయని, ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం కూడా కృషి చేయాలని చెప్పారు. సిటీని ఎప్పుడూ క్లీన్‌గా ఉంచుతున్న శానిటేషన్ వర్కర్లు, పారిశుధ్య కార్మికులు, మునిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. సఫాయి అన్న సలామ్ అన్న మొట్టమొదటిసీఎం కేసీఆర్ మాటలతోనే సరిపెట్టక మూడుసార్లు గౌరవ వేతనం పెంచారని గుర్తు చేశారు. 2500 స్వచ్ఛ అటోల పంపిణీకంటే ముందు సిటీలో 3,500 మెట్రిక్ టన్నుల చెత్త వ్యర్థాలను సేకరించేవారన్నారు. నేటికీ అది 6500 మెట్రిక్ టన్నులు సేకరణ జరుగుతోందన్నారు. దానివల్ల మెరుగైన పారిశుధ్యం సాధ్యమవుతోందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1350 స్వచ్ఛ ఆటోలు కలిసి మొత్తం 4500 ఆటోలు ఉన్నాయన్నారు. దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన చెత్త నుంచి విద్యుత్తు (వేస్ట్ టు ఎనర్జీ) ప్లాంట్ జవహర్‌నగర్‌లో జీహెచ్ఎంసీ ద్వారా మొట్టమొదటగా 20 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. మరో 28 మెగావాట్ల విద్యుదుత్పత్తికి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చినందుకు మొత్తం 48 మెగావాట్ల విద్యుత్తు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. పశు సంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి మాట్లాడుతూ.. సిటీలో గతంకంటే పారిశుధ్యం మెరుగుపడిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ బి.సంతోష్, ప్రియాంక అలా, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, జాయింట్ కమిషనర్ సంధ్య, డిప్యూటీ కమిషనర్లు, స్థానిక కార్పొరేటర్ లక్ష్మి, బాల్‌రెడ్డి, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.