Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు 30 శాతం జీతాలు పెంచాలని, 2021 జూన్ నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జూబ్లీహిల్స్ డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు. సర్కిల్ 19 పరిధిలోని కార్మికులతో కలిసి సోమవారం బోరబండ బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు సాయి శేషగిరిరావు మాట్లాడుతూ... పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచాలని, బకాయిలు చెలించాలని, కాంట్రాక్టు కార్మికకులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఈనెల 14, 15 తేదీలలో ఇందిరాపార్కు వద్ద జీహెచ్ఎంసీ, పారిశుధ్య కార్మికులు పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారని తెలిపారు. అప్పటికీ స్పందించకుంటే 16, 17 తేదీలలో కలెక్టర్ ఆఫీసులను ముట్టడిస్తామ న్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్మికులు ఉప్పలయ్య, నాగేష్, మల్లేష్, తులసీబాయి. అంజమ్మ, లక్ష్మమ్మ, కమలమ్మ, సుశీల, పద్మ, లలిత, సత్యమ్మ, యాదమ్మ, లాలూ నాయక్, భాస్కర్ నాయక్ పాల్గొన్నారు.