Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-తుర్కయాంజల్
తుర్కయంజాల్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేస్తామని మున్సిపల్ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి హెచ్చరించారు. సోమవారం మున్సిపల్ సిబ్బందితో కలిసి కమ్మగూడ, బ్రాహ్మణపల్లి, కోహెడ గ్రామాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో టీపీఓ అలీ పాషా, ఎన్ఫోర్స్మెంట్ ప్రవీణ్, ప్రశాంత్, మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, దాయానంద్, దాసు, తదితరులు పాల్గొన్నారు.