Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమ్‌లో ఈ నెల 13, 14 తేదీల్లో అతిపెద్ద బ్యూటీ సదస్సును రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వంశీకృష్ణ, సి.హేష్. కృష్ణ (ఫైదా ప్రెసిడెంట్), అమినా, రమేష్ జంపాల, మాస్టర్ పంకజ్, టాలీవుడ్ నటి జాహి, మోడల్స్ సర్లీన్, సలీనా పాల్గొన నున్నారు. ఈ సందర్భంగా ఎస్బీ ఇన్నోవేషన్స్ ఎండీ వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ సదస్సులో భాగంగా మేకప్‌లో మెలుకువలపై పేరు గాంచిన నిపుణులతో ప్రత్యక్ష కార్యశాల నిర్వహించడంతోపాటు చర్మ సౌంద ర్యం, రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించను న్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన దాదాపు 50 అనుబంధ ఉత్పత్తిదారులు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నట్టు పేర్కొన్నారు. జుత్తు, చర్మ సౌందర్యానికి సంబంధించిన అనేక ఉత్పత్తులు అనుబంధమై ఈ ప్రద ర్శనలో నిలువనున్నట్టు తెలిపారు. దీనికితోడు సదస్సు లో భాగంగా లైవ్ బ్యాండ్స్, ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నట్టు చెప్పారు. అమెరికా నుంచి ఈ కాన్సెప్ట్‌ను స్వీకరించి ఇక్కడ నిర్వహిస్తున్నారనీ, ఇక్కడ అన్నీ ప్రసిద్ధ బ్రాండ్స్ కాస్మొటిక్స్, స్కిన్ కేర్, పర్సనల్ ప్రొడక్ట్స్, బ్యూటీ ఫెస్ట్ సందర్భంగా ప్రచారం చేయనున్నట్టు తెలిపారు. భారతీయ బ్రాండ్లపై దృష్టి సారించి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన లేబుల్స్, సందర్శకులకు చర్మం రకం, జుట్టు శైలులకు తగిన ఉత్పత్తుల ద్వారా మార్గనిర్దేశం చేస్తారని తెలిపారు. ఈ ప్రదర్శనలో మేకప్ ఆర్టిస్టులు, చర్మవ్యాధి నిపుణులు, హెయిర్ స్టైలిస్టుల పాల్గొని మన చర్మానికి తగిన విధంగా అనుసరించాల్సిన అందాల పద్ధతులపై సూచనలు ఇవ్వనున్నట్టు తెలిపారు.