Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆరు స్థానాలు కైవసం చేసుకోవడంతో మరోసారి టీఆర్ఎస్కు రాష్ట్రంలో తిరుగులేదని నిరూపితమైనదని ఆ పార్టీ పార్టీ ఉద్యమ నేత, సీనియర్ నాయకులు ఆర్వి మహేందర్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఆర్వి మహేందర్ కుమార ఆధ్వర్యంలో టీఆర్ఎస్ భవన్లో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తయారు చేసిన నాయకులను ఇతర పార్టీలోకి లాక్కొని గెలిచినంత మాత్రాన సంబర పడుతున్నారనీ, అలాంటి వారికి నేటి టీఆర్ఎస్ విజయం ఓ చెంప పెట్టు అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇలాంటి విజయాలు టీఆర్ఎస్కు కొత్త కాదని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మూడు సీట్లు కూడా లేని నాయకులు టీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారనీ, వాళ్లకు సరైన సమయంలో ప్రజలు సరైన విధంగా బుద్ధి చెబుతారన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయం సాధిస్తామని కలగంటున్న బీజేపీ నాయకులకు సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. మరో రెండు దశాబ్దాల పాటు టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి రాష్ట్రంలో ఏ పార్టీకీ లేదని మహేందర్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చందు, ఈశ్వర్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.