Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
ఎస్సీ వర్గీకరణ చేపట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు నల్ల నర్సింగ్ రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఈ నెల13వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తే విజయవంతంగా ముగిసిందనీ, పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ నాయకులు హాజరయ్యారని తెలిపారు. దశాబ్దాల కాలంగా మాదిగలకు రిజర్వేషన్ విషయంలో న్యాయం జరగక అణచివేతకు గురవుతున్నారనీ, ఎస్సీ వర్గీకరణే శరణ్యమన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టి చట్టబద్దత కల్పించాలనీ, ఇందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకా ఇలానే జాప్యం జరుగితే యువత తీవ్రంగా నష్టపోతారన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమం చేయాలని సూచించారు.