Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల అగ్రికల్చర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ బాణోత్ సుజాత నాయక్, హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ డీజీఎం చైతన్యతో కలిసి వాటర్ పైప్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో పూర్తిస్థాయిలో వాటర్ పైప్ లైన్ పనులను త్వరగతిన పూర్తి చేసి ఇవ్వాలని డీజీఎంను కోరడంతో వారు సానుకూలంగా స్పందించి మెట్రో వాటర్ వర్క్స్ ఎండీతో మాట్లాడి, వారి సహకారంతో నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ ఏఈ శత్రు నాయక్, అగ్రికల్చర్ కాలనీ అధ్యక్షుడు తాండ్ర మణిపాల్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, జి.చంద్రశేఖర్ రెడ్డి, పలువురు కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.