Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
రామంతపూర్ డివిజన్ పరిధిలో ఉన్న బస్తీ దవాఖాన సరిపోకపోవడంతో స్థానికులు డివిజన్లో బస్తీ దవాఖా నాల సంఖ్యను పెంచాలని రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కార్పొరేటర్ జీహెచ్ఎంసీ అధికారులు డీఈ చందన, మెడికల్ ఆఫీసర్ సాయిరెడ్డి, సుదర్శన్‌తో కలిసి రామంతపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బండారు వెంకట్ రావు డివిజన్లో పలు కాలనీల కమ్యూనిటీ హాళ్లను పరిశీలి ంచారు. అందులో భాగంగా ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్, రాజేందర్ నగర్ కమ్యూనిటీ హాల్, ఓల్డ్ రామంత పూర్ కమ్యూనిటీ హాల్‌లను స్థానికులతో కలిసి పరిశీలిం చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలు ఇలాంటి అనారోగ్యాలకకు గురికాకుండా బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి సంకూ రి కుమారస్వామి, స్థానికులు బొడ్డుపల్లి దానయ్య, బుర్ర రాజేశ్వర్, గుండె భిక్షపతి, సత్యనారాయణ, రుద్రల నరసింహ, తదితరులు పాల్గొన్నారు.