Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
రామంతపూర్ డివిజన్ బాలకృష్ణ నగర్లో గల నాళాకు పక్కన ఆనుకుని ఉన్న బఫర్ జోన్ స్థలంలో కొంతమంది స్థలాన్ని ఆక్రమించి దాన్ని ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారని స్థానికులు రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు దీష్టికి తీసుకొచ్చారు. వారు వెంటనే స్పందించి రెవిన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఎమ్మార్వో గౌతమ్ కుమార్, ఆర్ఐ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో వారు బాలకృష్ణ నగర్ బఫర్ జోన్ స్థలాన్ని కార్పొరేటర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. బాలకృష్ణ నగర్ లోని 8 గుంటల శ్మశాన వాటిక స్థలాన్ని కూడా పరిశీలిం చారు. అందులో భాగంగా బఫర్ జోన్లో ఉన్న స్థలంలో జీహెచ్ఎంసీ బోర్డ్స్ ఈ రోజే పెట్టేస్తాం అని చెప్పారు. కార్పొరేటర్ మాట్లాడుతూ రామంతపూర్ డివిజన్లోని ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురి కాకుండా చూ డాలని తహసీల్దార్‌ను కోరారు. ప్రభుత్వ స్థలాలు ఎవరైనా కబ్జా చేస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామంతపూర్ డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకట్రావు, మేడ్చల్ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి రేవు నరసింహ కుర్మా, పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, ఇళ్ళిటం నరసింహారెడ్డి, పాడిగం నాగేష్ పాల్గొన్నారు.