Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడు దాం అని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. బుధవారం నల్లకుంట-మాతా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ షిరిడీ సాయిబాబా సంస్థాన్ కాన్ఫరెన్స్ హాల్, తిలక్ నగర్లో జరిగిన గీతా జయంతి ఉత్సవం కార్యక్రమంలో ముఖ్య అథితిగా పాల్గొని, శ్రీ శిరిడి సాయి నాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాతా వాకర్ క్లబ్, పాలకవర్గం సభ్యులతో కలిసి ప్లాస్టిక్‌ని నిషేదిద్దాం పర్యావరణాన్ని కాపాదడుదాం అనే పేపర్ బ్యాగ్ చేతి సంచులను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భావితరాల వారికి కాలుష్యం లేని వాతావరణాన్ని అందిద్దాం అన్నారు. ప్రతి ఒక్కరూ కాలుష్య రహిత సమాజం కోసం పాటుపడాలన్నా రు. కార్యక్రమంలో గౌరయ్య, డాక్టర్ రఘునాథ రావు, మా తా వాకర్స్ క్లబ్ ముఖ్య సలహాదారు శ్రీరామ లింగేశ్వర రావు, మాతా వాకర్ క్లబ్, పాలక్వర్గం ప్రెసిడెంట్ లింగా ప్రకాష్, సెక్రెటరీ సముద్రాల చంద్ర, సందీప్, ట్రెజరర్ శరత్ కుమార్, మాతా వాకర్ క్లబ్ సభ్యులు, పాల్గొన్నారు.