Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని వీకర్సెక్షన్ కాలనీలలో మిషన్ భగీరథ పతకం కింద ఉచిత మంచితీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ మంగళవారం ఎమ్మెల్యే మంచిరెడ్డికి కౌన్సిలర్ మర్రి మాధవి అమరెందర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని మన్నెగూడలో 1985లో అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు దాదాపు వేయి ప్లాట్లను ఉచితంగా అందజేసిందనీ, అందులో పేదలు ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్నారని తెలిపారు. మున్సి పాల్టీగా ఏర్పడినప్పటి నుంచి హెచ్ ఎమ్ డబుల్యూ వారు మీటర్లు బిగించి బలవంతంగా నల్లా బిల్లు వసూలు చేస్తు న్నారనీ, పేదలకు ఉచితంగా నీళ్లు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అధికారులు బలవంతంగా బిల్లులు వసూలు చేస్తున్నారని తెలిపారు. మీరు చొరవ తీసుకుని ఉచితంగా నీటిని సరఫరా చేసే విధంగా కృషి చేయాలని కోరారు.