Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
సరూర్‌నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అభివృద్ధిపై ఆలోచన లేకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మహేశ్వరం నియో జకవర్గం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బాలకిషన్ అన్నారు. మంగళవారం సరూర్ నగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బేరబాల కిషన్, ధర్పల్లి అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ బోయిని మహేందర్ యాదవ్, నియోజకవర్గం టీఆర్ఎస్ యువజన విభాగం ప్రెసిడెంట్ లోకసాని కొండల్‌రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు అంకిరెడ్డి మాట్లాడుతూ సరూర్‌నగర్ డివిజన్ అభివృద్ధికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారం ఎంతో అవసరమన్నారు. బీజేపీ నాయకులు అనవసరంగా రాజకీయాలు చేస్తే డివిజన్ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ నాయకులు అడ్డుకోవడం ప్రజలు తీవ్రంగా గమనిస్తు న్నారన్నారు. కార్పొరేటర్‌కు అవగాహన లేకపోవడమే కొత్త సమస్యగా ఉందనీ, ఏడాది కాలంగా కష్టపడి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో రూ.84 లక్షలతో గ్రౌండ్ డ్రయినేజీ పనులను మంజూరు చేయించి తీసుకొని వస్తే తీరా శంకుస్థాపన సమయానికి రాజకీయాలతో రచ్చ చేయడం ఆపై రాజకీయ డ్రామాలు ఆడటం బీజేపీ నాయకులకు మంచి పద్ధతి కాదన్నారు. ఈ సమావే శంలో నాయకులు డివిజన్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, మైనార్టీ నాయకులు మహ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ సలీం, నాగమణి, భాగ్యమ్మ, లక్ష్మయ్య, కందుల రాము, మొగిల్లా మల్లేష్, గౌని శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీను, నరేష్, ఆర్కేపురం డివిజన్ ప్రెసిడెంట్ పెండ్యాల నగేష్, సాజీద్, తదితరులు పాల్గొన్నారు.