Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
ములుగు భద్రాద్రి కొత్తగూడెం నల్లగొండ యాదాద్రి జిల్లా నుంచి అక్రమంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఓవర్ లోడుతో వస్తున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరుతూ మంగళవారం ఉప్పల్ రామంతపూర్ లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్రమ ఇసుక రవాణా అరికట్టాలి అని కోరుతూ టీఎస్ఎన్డీ అధికారులకు విన్నవించిన కొంతవరకు కాళేశ్వరం నుంచి ఓవర్ లోడ్‌ను అరికట్టిన ములుగు భద్రాద్రి ఎటునాగారం యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ విచ్చలవిడిగా ఓవర్ లోడ్ ఇసుక తరలివస్తుంటే అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. అనుమతుల్లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకుని సీజ్ చేయాలనీ, లేనిపక్షంలో లారీ ఓనర్స్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సైదులు, సత్త యాదవ్, వీరేశం, సత్తయ్య, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.