Authorization
Sat March 22, 2025 09:42:35 pm
నవతెలంగాణ-హైదరాబాద్
గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్లోని సుందర్బాగ్, జాంబాగ్, పూసల బస్తీ తదితర ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అవుతుందనీ, వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ సంతోష్ దృష్టికి గోషామహల్ టీఆర్ఎస్ నాయకుడు ఎం.ఆనంద్ కుమార్ గౌడ్ తీసుకెళ్లి వివరించారు. ఆనంద్ కుమార్ గౌడ్ తెలిపిన సమస్యపై మంగళవారం ఆయా ప్రాంతాల్లో జీఎం సంతోష్ కుమార్, డీజీఎం జగదీష్, హిందీనగర్ మేనేజర్ కుల శేఖర్‌తో కలిసి ఆనంద్ కుమార్ గౌడ్ పాదయాత్ర చేపట్టి, సమస్యను చూపించారు. వెంటనే స్పందించిన అధికారులు సమస్య లను గుర్తించి, పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఇన్చార్జి ఆనంద్ కుమార్ గౌడ్, జి.నందు కుమార్, రఘు, భాస్కర్, జై, మహేష్ గౌడ్, సల్మాన్, మదన్ లాల్ యాదవ్, షెమ్మి, శేఖర్, లక్ష్మీ, నరేష్, రఘు, సాయి, రమేష్, రాము, కమల్, జోగిల్ భారు, తదితరులు పాల్గొన్నారు.