Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
బంగారు ఆభరణాలకు హైదరాబాద్ హబ్‌గా మారుతుందని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఫర్జీ కేఫ్‌లో ప్రఖ్యాత జ్యువలరీ డిజైనర్ స్నేహరెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన 2022 క్యాలెండర్, ఎస్సార్ జ్యువెలర్స్ డాట్ ఇన్ వెబ్ సైట్‌ను మేయర్ నటి నివేత పేతిరేజ్తో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. నటి నివేత పేతి రాజ్ మాట్లాడుతూ లైట్ వెయిట్ జ్యువెలరీతోపాటు డైమండ్ ఆభరణాలు తనకెంతో ఇష్టమన్నారు. డిజైనర్ స్నేహా రెడ్డి మాట్లా డుతూ 15 ఏండ్లుగా జ్యువెలరీ డిజైన్ రంగంలో ఎన్నో ఆభరణాలు డిజైన్ చేసి, అనేకమంది సెలబ్రిటీలకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ డాక్టర్ శాంత తోటమే, సినీ దర్శక నిర్మాతలు మున్నా బులిపూడి, అవార్డు విన్నింగ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య, అల్లు నిలుషా, పద్మా సోమిరెడ్డి, డాక్టర్ మాధవి, శైలజా రెడ్డి తో పాటు ప్రముఖులు పాల్గొన్నారు.