Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్‌పేట
పల్లె సీమలే పట్టు గొమ్మలని, పల్లెలు అభివద్ధి చెందితేనే రాష్ట్రం అభివద్ధి చెందుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండలంలోని శామీర్‌పేట, బొమ్మ రాసిపేట్, పొన్నాల, లాల్‌గడి మలక్‌పేట, అలియాబాద్, మజీద్ పూర్, యాడారం, తుర్కపల్లి, మురహరిపల్లి గ్రామాల్లో కోటి రూపాయలతో చేపట్టనున్న పలు అభివద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు అభివృద్ధిలో ముందున్నాయనీ, అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డ్, వైకుంఠధామాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రతి గ్రామనికీ గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరు చేసి, అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ మధుకర్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యదర్శి జహంగీర్, ఎంపీపీ ఎల్లుబాయి, జడ్పీటీసీ అనిత, ఎంపీటీసీలు సుజాత, సాయి బాబా, ఇందిరా, అశోక్ రెడ్డి, అశోక్, శ్రీనివాస్, సర్పంచులు విలాసాగరం బాలమని, సరసం మోహన్ రెడ్డి, ధార భాస్కర్, చిందు వనజా శ్రీనివాస్‌రెడ్డి, గురక కుమార్, సుజాత, గీతా మహేందర్, కో ఆప్షన్ సభ్యులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుదర్శన్, నాయకులు అఫ్జల్ ఖాన్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.