Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్మలిస్ట్స్ ( హెచ్‌యూజే) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళ వారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీనియర్ జర్నలిస్టు పద్మరాజు అధ్యక్షతన హెచ్‌యూజే సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు ఇ.చంద్ర శేఖర్, కార్యదర్శి కె.నిరంజన్, నాయకులు నాగవాణి, రాజశేఖర్, మధుకర్, నవీన్, దామోదర్, వీరేశ్ తదితరులు మాట్లాడారు. నగరంలో పని చేస్తున్న జర్నలిస్టులకు సొంత ఇండ్లు లేక లేక.. అద్దె ఇండ్లల్లో కిరాయి చెల్లించలేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇండ్ల విషయంలో ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఒకవైపు కరోనా, మరో వైపు ఆర్థిక సమస్యలు జర్నలిస్టుల మనుగ డను చిన్నాభిన్నం చేస్తున్నాయని అందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హెల్తు కార్డులను పునరుద్ధరించి, అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టి, వారు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించాలన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ 2022 జనవరి ప్రారంభం లోనే అక్రిడిటేషన్ కార్డులు అందజేయాలని సమాచార శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో తాత్సారం చేస్తే ఉద్యమించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో సంఘం నాయకులు ప్రశాంత్, రాము, రాజేందర్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.