Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
దుండిగల్‌లోని ఇసిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ఎలక్ట్రికల్ ఎలక్ట్రా నిక్ ఇంజినీరింగ్ విభాగాలో ఆధ్వర్యంలో జాతీయ ఎనర్జీ కన్సర్వేషన్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా ఫ్లైవెల్ టెక్నాలజీ ఎన్నోవేటర్ డాక్టర్ చాగంటి శ్రీనివాస్ భాస్కర్ హాజరై మాట్లాడుతూ మానవ మనుగడలో పర్యావరణ సహజ వనరుల వినియోగ శక్తి అవసరంగా మారిందన్నారు. గాలి, నీరు, విద్యుత్ ఎంతగా పొదుపు చేస్తే భవిష్యత్ భావితరాలకు అంతగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పెరుగు తున్న కాలుష్యాన్ని ఉపయోగించుకుని విద్యుత్‌ని ఎలా తయారు చేయాలి, పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కాలుష్య రహిత ప్రత్యామ్నాయమైన ఫ్లైవెల్ టెక్నాలజీపై దృష్టి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మెన్ మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాలుష్య రహిత పర్యావరణ వినియోగం ఈ సమాజానికి ఎంతగానో అవసరమన్నారు. సహజ వనరులైన గాలి, నీరు, విద్యుత్ వినియోగంపై ప్రత్యామ్నాయంగా విద్యార్థులు ప్రయత్నిం చాలన్నారు. విద్యార్థులు తాము విద్యుత్తుని ఉపయోగిం చుకున్న తర్వాత ఎప్పటికప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం వల్ల విద్యుత్ ఆదా చేసుకోవచ్చు అన్నారు. కళాశాలలో నూతన ఆవిష్కరణల వల్ల సహజ వనరులపై అవగాహన పెరుగుతుందనీ, దీనివల్ల సహజ వనరులు పొదుపు చేసిన వారం అవుతాం అనీ, ముందు తరాలకు విద్యుత్‌ను పొదుపు చేసిన వారమవుతాం అన్నారు. అనంతరం ప్రిన్సి పాల్ ఎల్వీ నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణానికి హాని కలిగించకుండా ఎలా ఉపయోగిం చాలి అనే అంశాలపై అవగాహన పెంపొందించుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై సోలార్‌పై ఆవిష్కరణలు పెంపొందించుకోవాలన్నారు. సహజ వనరులు కరిగిపో కుండా కాపాడుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు విద్యుత్ పొదుపు పై అవగాహన, క్విజ్, పోటీలు స్కిట్స్ ప్రోగ్రామ్స్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ కరస్పాండెంట్ సీహెచ్. సత్తిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ట్రెజరర్ బి.రాజేశ్వరరావు, ఈఈఈ హెచ్ఓడీ పి.శ్రీధర్, కో-ఆర్డినేటర్ రాజేందర్, రంజిత్ కుమార్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.