Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ణు సమావేశం శుక్రవారం వాడీవేడిగా జరిగింది. పలు కీలక నిర్ణ యాలను అధికారులు వెల్లడించారు. బోర్డు అధ్య క్షుడు బ్రి గేడియర్ అభిజిత్ చంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సాయన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే హౌదాలో హాజరయ్యారు. నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అజిత్ రెడ్డి పాల్గొని చర్చలు జరిపి పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. సమావేశం ప్రారంభం కాగానే ఎజెండాలోని పలు అంశాలపై చర్చించారు. మంచినీళ్లు, మురుగు కాల్వలు, పార్కుల అభివృద్ధితో పాటు పలు పనులను ఆమోదించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని అంతర్గత బదిలీలు చేయాలనీ, కంటోన్మెంట్ బొల్లారం జనరల్ ఆస్పత్రిలో సర్వీస్ విధులను స్వల్పంగా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి ఎక్స్అఫిషియో హౌదా లో వచ్చిన ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్‌ను రప్పించాలని బ్రిగేడియర్ కోరారు. వెంటనే స్పందించిన నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన చార్జీలను కూడా వెంటనే ఇవ్వాలని కోరా రు. అంజి స్టోర్స్ మాట్లాడుతూ కంట్రోల్ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఉంటే అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బోర్డు అధికారులు ఎఫ్ఎస్ఐ కూడా కొంత మార్పు తీసుకొచ్చారు, ఇంతకుముందు 1.5 హాలో నిర్మాణం జరుపుకోవాలని ఆంక్షలు ఉండేనీ, ప్రస్తుతం వాచ్మెన్ రూం స్టేర్ కేస్రులో ఈ 1.5 నుంచి మినహాయింపు చేశారు. పంప్ హౌస్‌లో సోలార్ విద్యుత్ ద్వారా నిర్వహించాలని కోరారు. సమావేశం అనంతరం నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ సిమెంట్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామనీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అన్నిటినీ రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. కంటోన్మెంట్ సమస్యలను బీజేపీ నాయకులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుకు ఇవ్వాల్సిన టీటీ చార్జీలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.