Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి నియోజకవర్గం బీజేపీ ఆధ్వర్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఆదివారం ఆనంద్‌బాగ్‌లోని బృందావన్ గార్డెన్లో జరిగే పౌర సన్మాన కార్యక్రమంను జయప్రదం చేయాలని బీజేపీ మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షులు హరీష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బృందావన్ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఈటల రాజేందర్ కు పౌర సన్మానం జరపాలని నిర్ణయించామన్నారు. ఈటల పార్టీలో చేరిన తర్వాత పార్టీ బలోపేతం అవుతుందనీ, ఈటల గెలుపును ప్రతి ఒక్కరికీ తెలియజేయడం, ఈటల రాజేందర్ విజయోత్సవాన్ని ఉత్సాహ వాతావరణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఈటల ద్వారా కేసీఆర్, ఆయన కుటుంబ పాలన గురించి, ఆయన పార్టీలో పడిన బాధలు, ఉద్యమకారులు పడుతున్న బాధలు, ప్రత్యేక తెలంగాణ కాలంలో ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. జైళ్ళ పాలై అనేక రోజులపాటు జైలులో ఉన్న నాయకులు కూడా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ఉద్యమకారులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్, బీజేపీ సీనియర్ నాయకులు వికే మహేష్, జీకే హనుమంతరావు, మల్కాజిగిరి అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, వాసంశెట్టి శ్రీనివాస్, మంగేష్, డి.సంతోష్ కుమార్, సోమ శ్రీనివాస్, రామకృష్ణ, సురేష్ యాదవ్, తుపాకుల జనార్ధన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.