Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు ఇండ్లలో దొంగతనం,
- మరో మూడు ఇండ్లలో ప్రయత్నం
- 4.5 తులాల బంగారం, 84 తులాల వెండి, రూ.35 వేలు అపహరణ
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన డాగ్ స్క్వాడ్, ఎల్బీనగర్ డీసీపీ,
క్రైమ్ డీసీపీసీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
సిటీ శివారులో వరుస దొంగతనాలు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకే ఊరిలో 9 చోరీలు జరగటంతో గ్రామస్తులంతా భయపడుతున్నారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటసింగారం గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. పోలీ సులు, స్థానికుల వివరాల ప్రకారం బాట సింగా రం గ్రామంలో ఆరు ఇండ్లల్లో చోరీ జరగగా, మరో మూడు ఇండ్లల్లో చోరీ యత్నం జరిగింది. ఈ ఘటనలో 4.5 తులాల బంగారం, 84 తులాల వెండి, రూ.35 వేల నగదును దుండ గులు ఎత్తుకెళ్లారు. దీంతో స్థానికులు ఆందోళ నకు గురవుతున్నారు. గ్రామ శివారులో తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసిన దుండగులు అర్ధరాత్రి గ్రామంలోకి ప్రవేశించి పక్క ఇంటివారి ఇండ్లకు బయట నుంచి గడియ పెట్టి చోరీ చేశారు. ఇలా చోరీ చేసిన ప్రతీ ఇంటి వద్ద పక్క ఇంటికి బయట నుంచి గడియ పెట్టి ఉండటం గమనార్హం. గడిచిన 15 ఏండ్లలో గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రాత్రి తొమ్మిది ఇండ్లల్లో దొంగతనాలు జరగడంతో ప్రజలు జంకుతున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా చోరీ జరగడంతో బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్, నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, క్రైమ్ డీసీపీ యాదగిరితో పాటు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి పరిశీలించారు. సీసీఎస్, ఎస్ఓటీ, క్రైమ్ పోలీసులతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అపరిచిత వ్యక్తులు గ్రామంలో సంచరించినట్టు కనిపిస్తే పోలీసుల కు సమాచారం అందించాలని సూచించారు.