Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 49 శాతం మంది పాస్ కావడం, పాసైన వారిలో కూడా అనేక మంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావడం ఇంటర్ బోర్డు వైఫల్యానికి నిదర్శమని ఎస్ఎఫ్ఐ నాయకుడు బ్యాగరి వెంకటేష్ అన్నారు. శుక్రవారం అల్వాల్ సర్కిల్ మీసేవా కూడలి వద్ద నిర్వహించిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడారు. కరోనా కారణంగా విద్యార్థు లకు సరిగ్గా క్లాస్‌లు జరగలేదన్నారు. విద్యార్థులు కూడా పరీక్షలు రాయడానికి సంసిద్ధంగా లేని సమయంలో ఎలా పాస్ అవుతారనీ, నామ మాత్రపు పరీక్షలే అన్న ఇంటర్ బోర్డు తప్పుడు నిర్ణయాల వల్ల ఇంత తక్కువ రిజల్ట్స్ వచ్చిందని ఎస్ఎఫ్ఐ భావిస్తుందన్నారు. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్‌లో ఫెయిలైన విద్యార్థుల్లో కొందరు పదో తరగతిలో 10/10 జీపీఏ గ్రేడ్ వచ్చిన వారు కూడా ఉండటం ఈ పరీక్షల నిర్వహణ సమంజసం కాదనే విషయాన్ని తెలియ జేస్తోందన్నారు. ఏప్రిల్‌లో నిర్వహించాల్సిన పరీక్షలను ఆరు నెలలు ఆలశ్యంగా నిర్వహించారన్నారు. కొవిడ్ వల్ల కాలేజీలు తెరువలేని విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు పెట్టినా విద్యార్థులు రాయలేరనే విషయాన్ని ఎస్ఎఫ్ఐ మిగతా విద్యార్థి, తల్లిదండ్రుల సంఘాలు చెప్పినా వినకపో వడం బోర్డు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ఫెయిలైన విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడిని నివా రించడానికి బోర్డు తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులకు కనీస పాస్ మార్కులు ఇవ్వాలనీ, విద్యార్థులు సెకండి యర్‌లో ఉన్నందున వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అందరికీ న్యాయం చేయాలని కోరారు. అధిక మార్కుల కోసం మరోసారి పరీక్షలు నిర్వహించాలినీ, తక్షణమే పునర్ మూల్యాంకనం చేపట్టాలని కోరారు. ఇంటర్ బోర్డు ఏకపక్ష నిర్ణయాల వల్లనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఎస్ఎఫ్ఐ భావిస్తుందన్నారు. విద్యార్థులెవరూ ఆత్మహత్య లు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు సరైన న్యాయం జరిగేంత వరకు ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందని తెలిపారు. తక్షణమే విద్యార్థులకు ఇంటర్ బోర్డు సరైన వివరణతో భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో అల్వాల్ మండల ఉపాధ్యక్షులు అనిత, శిరీష, నాయకులు, నవీన్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.