Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
- అనుమతుల్లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలో అక్రమ నిర్మాణాల పరంపర కొనసాగుతూనే ఉంది. హైకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. సర్కిల్ కార్యాలయాల పరిధిలో అక్రమ నిర్మా ణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలనీ, నోటీ సులతో కాలయాపన చేయకుండా నిర్మాణదారులు చేపట్టిన అక్రమాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని హైకోర్టు ఎన్ని మార్లు హెచ్చరించినా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూకట్పల్లి సర్కిల్ కార్యాలయంలోని, జోనల్ కార్యాలయం, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఇతర అధికారులు కోర్టు ఆదేశాలను ఏ మాత్రం ఖాతరు చేయకపోవడం గమనార్హం. కూకట్పల్లి మున్సి పల్ పరిధిలో టౌన్‌ప్లానింగ్ విభాగంలో అక్రమాలు, అవి నీతి జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో స్థాయి లైన్మెన్ మొదలు అసిస్టెంట్ సిటీ టౌన్ ప్లానర్ నిర్మాణదారుల నుంచి ముడుపులు తీసుకుంటూ అక్రమ నిర్మాణాలకు తెరలేపుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. బాలానగర్ మండలం, ఫిరోజ్‌గూడ ప్రాంతంలో అనుమతిలేకుండా సెల్లార్ నిర్మాణ పనులు చేపడుతూ, తీసుకున్న అనుమతి ప్రకారం కాకుండా బహుళ అంతస్తు నిర్మాణం చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అడ్డుకోవాల్సిన కొందరు టౌన్‌ప్లానింగ్ అధికారులు అక్రమ మార్గాల ద్వారా అందినకాడికి దండుకుంటూ చూసీచూడనట్టు వ్యవహ రిస్తున్న తీరు కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగిన చంద ంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఫిరోజ్‌గూడ ప్రధాన రహదారిపై ఫుట్ పాత్‌ను సైతం ధ్వంసం చేసి ఆక్రమిస్తూ మట్టి కప్పేసి నిర్మాణం చేపట్టడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కిల్ అధికారులకు టీఎస్ బీపాస్ చట్టం పేరు మాటున ముడు పులు ముట్టజెప్పి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడడం లేదనీ, అందుకు గల కారణాలు ఏంటని అధికా రులను పలువురు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ విశ్వన గరం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో కూకట్పల్లి నియోజకవర్గంలో అభివృద్ధికి కొందరు అవినీతి, అక్రమ నిర్మాణదారులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ విఘాతం కలిగిస్తున్నారనీ, అక్రమ నిర్మాణాలకు, అవినీతి పనులకు కొందరు స్థానిక నాయకులు అండగా నిలుస్తు న్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రేటర్ ఆదాయానికి గండి పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాం
రవీందర్, (డిప్యూటీ కమిషనర్), కూకట్పల్లి సర్కిల్
అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దష్టి సారించాం. ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ టీం కొన్నింటిని గుర్తించడంతో నోటీసులు జారీ చేశాం. ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతులపై సమగ్ర దర్యాప్తు చేసి ఉన్నత అధికారులకు నివేదిక అందజేస్తాం. అక్రమ నిర్మాణాలను అడ్డుకోకుండా నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.